భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: ప్రతి విద్యార్థిని వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. ఆంధ్ర విద్యార్థి సంఘం (AVS) ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి స్కూల్లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడారు. “ఇంటి నుంచి…