భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: గత ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిన్నారం మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరవధిక ధర్నాకు దిగారు. ఉదయం ఐదు గంటల నుంచి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో కార్మికులు విధులను పూర్తిగా బహిష్కరించారు.

ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, దసరా, దీపావళి పండుగల సమయంలోనూ కార్మికుల కుటుంబాలతో చెలగాటమాడుతున్నారని…