భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: పాణ్యం నియోజకవర్గంలోని ఆర్జీఎం కళాశాల సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, హైవే పోలీసుల సమాచారం మేరకు కర్నూలు వైపు నుంచి వస్తున్న లారీ, నంద్యాల వైపు నుండి వస్తున్న కారును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పాణ్యం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని కథనాలు:





