భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: ఆదోని మండలంలోని మదిరె జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు నంద్యాలలో జరిగిన బేస్‌బాల్ ఎంపికల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందారు. అండర్-14 విభాగంలో పలమనేరు పోటీలకు సోమలింగ, అలేఖ్య ఎంపికయ్యారు. అండర్-17 విభాగంలో అహోబిలం పోటీలకు ఉషావాణి ఎంపికైంది. విద్యార్థులను అభినందించిన హెచ్ఎం రంగన్న గారు క్రీడల్లో రాణించాలని సూచించారు. కోచ్‌లు జి.ఈరన్న, ఎం.చామంతి, ఉపాధ్యాయ బృందం కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలకు మదిరె పాఠశాల విద్యార్థుల ఎంపిక
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




