భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రం రక్షణ రంగంలో మరో పెద్ద అడుగు వేయబోతోంది. ప్రతిష్ఠాత్మక సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) ఇప్పుడు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండలో భారీ స్థాయి సమీకృత ఆయుధ వ్యవస్థ, ప్రొపెల్లెంట్‌ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం కానుంది.బీడీఎల్‌ సంస్థ మొదటి దశలో రూ.650 కోట్లను, రెండో దశలో రూ.550 కోట్లను వెచ్చించనుంది. మొత్తం రూ.1,200 కోట్లతో ఈ యూనిట్‌ స్థాపన జరగనుంది. ప్రొపెల్లెంట్‌ మోటార్లు, సమీకృత ఆయుధ వ్యవస్థల…