భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జీవక్రియ రుగ్మతల నిర్వహణలో గట్ మైక్రోబయోటా చికిత్సా సామర్థ్యంపై పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని పి.రాజ్యలక్ష్మీ దేవిని డాక్టరేట్ వరించింది. ‘ఎలుకలలో స్థూలకాయం, మధుమేహ చికిత్స కోసం ప్రోబయోటిక్స్ తో కలిపి స్వల్ప-శృంఖల కొవ్వు ఆమ్లాలు (షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లేదా ఎస్సీఎఫ్ఏలు) పోషించే పాత్ర’ అనే శీర్షికతో ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ అధ్యాపకుడు డాక్టర్ ఎం.విన్యాస్ బుధవారం…