భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: పారిశ్రామిక అభివృద్ధికి దిశగా, నందిపాడు గ్రామంలో 38.4 ఎకరాల్లో 600/1200 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ఏర్పాటు జరుగుతోంది. జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో నిర్మాణానికి ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రాజెక్ట్, నంద్యాల జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తుందని కలెక్టర్ తెలిపారు. SECI డైరెక్టర్ శివకుమార్ జిల్లా కలెక్టర్…