భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా మరో ముందడుగు పడింది. నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని జానకంపేట తండా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ను మెదక్ MP మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యాలయంలోని విద్యార్థినులకు శుద్ధి చేసిన, స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాఠశాలలో చదువుకుంటున్న బాలికలకు శుభ్రమైన తాగునీటి సౌకర్యం…






