భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం కుక్క దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కొమ్మనబోయిన యాకమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.
ఉదయం సమయంలో వృద్ధురాలిపై కుక్క దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి యాకమ్మను హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అక్కడ మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్ ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం అవసరమని భావించి తదుపరి చికిత్స కోసం…






