భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సంప్రదాయ పద్ధతులకు ప్రాధాన్యతనిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ ప్రాంగణంలో ఉన్న విష్ణు ఉన్నత పాఠశాలలో శనివారం పర్యావరణహిత దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని వినూత్న కార్యక్రమాలతో పండుగ సంబరాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. నాగజ్యోతి దీపావళి పండుగ విశిష్టత, ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు పండుగ ప్రత్యేకతను తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. కాలుష్యానికి కారణమయ్యే బాణాసంచాకు…