భారత్ సమాచార్, అనంతపురం జిల్లా: ఆలూరులో ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 25 ఏళ్ల వయస్సు ఉన్న ఆ యువకుడి శవం ఆలూరులోని గుంతకల్లు రహదారి వద్ద గల జగనన్న కాలనీ సమీపంలో బోర్ల పడి ఉంది. ఆ దారిలో వెళ్తున్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఆలూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ మృతి ఆత్మహత్యా లేక ఎవరైనా…
ఆలూరులో యువకుడి అనుమానాస్పద మృతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




